
రాష్ట్రంలోని 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు మంగళవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 954 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వివిధ కారణాలతో కొన్ని చోట్ల ఆగిపోయిన స్థానాలు, కొన్ని చోట్ల గెలిచిన వారు మరణించడంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికార్లు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో సీనియర్ సిటిజన్స్, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇబ్బంది లేకుండా అధికారులు వీల్చైర్లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్లో మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు ఈనెల 18న జరగనుంది.