
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమని, ప్రగతిభవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు.
ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం. త్వరలో భేటీ అవుదామని బండి సంజయ్ షర్మిలకు చెప్పారు.