
కరోనా థర్డ్ వేవ్ రాబోతున్నదనే వార్తల దృష్ట్యా, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఒక యూనిట్ గా తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత అధికారులతో కరోనా థర్డ్ వేవ్ కి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.
బడులు తెరుచుకున్నందున స్కూల్ పరిధిలో కోవిడ్ నిబంధనలు పక్కా గా అమలు కావాలి అని జగన్ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో కరోనా టెస్ట్ లకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని, ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణం కరోనా టెస్టులు నిర్వహించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు ప్రజలకు వైద్యానికి అనుకూలంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు. దీనిలో భాగంగా మంచి ఔషధ నియంత్రణ, పరిపాలన సౌలభ్యం కొరకు కొత్తగా రెండు వెబ్సైటు లు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారి పెళ్లిళ్లు చేసుకునే వారు ముందుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి అని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు సూచించారు.