
Women’s World Boxing Championship: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరింది. 50 కేజీల విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అంతేకాకుండా భారత బాక్సర్లు నీతు గాంగాస్ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్లో అడుగుపెట్టారు.