
భారత Aus జట్టు ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఆసీస్ 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియా మహిళలతో ఆదివారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో మిథాలీ సేన రెండు వికెట్లతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళలు సమష్టిగా రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో ముగించింది. తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా ఆఖరి వన్డేలో మాత్రం ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు జట్లు ఏకైక పింక్ బాల్ టెస్ట్‌లో తలపడనున్నాయి.
That is it!⁰⁰⚡️
Came agonisingly close in the 2nd ODI but have crossed the finish line NOW. #TeamIndia win the 3rd ODI by 2 wickets after a thrilling chase and with it end Australia’s marathon 26-match unbeaten streak. #AUSvIND pic.twitter.com/4b7QJxvX5w
— BCCI Women (@BCCIWomen) September 26, 2021
మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో మిథాలీ సేన తీవ్రంగా నిరాశపరిచింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో చిత్తయిన మిథాలీ సేన.. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫస్ట్ వన్డేలో పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైన మిథాలీ సేన రెండో వన్డేలో విజయం ముంగిట బోల్తా కొట్టింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా ఝులన్ గోస్వామి నోబాల్ వేయడంతో విజయం చేజారింది.