
WhatsApp New Features: వాట్సాప్ మరో అద్భుత ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. 2 మొబైల్స్ లో ఒకే నెంబరుపై వాట్సాప్ సేవలు త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం బీటా టెస్టర్లు దీన్ని పరీక్షిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఒక ఖాతాపై ఎన్ని డివైజ్ లు వాట్సాప్ లాగిన్ అయి ఉన్నది తెలుసుకునే ఫీచర్ సైతం తీసుకువస్తోంది. దీని వల్ల తమ ఖాతాను తెలియని వారు యాక్సెస్ చేస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది.