
WhatsApp Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు డెస్క్ టాప్ నుండి గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.
వాట్సాప్ కొత్త వెర్షన్ డెస్క్ టాప్ యూజర్లు 8 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్‌లను చేసుకోవచ్చు. అయితే, గరిష్టంగా 32 మంది యూజర్లతో మాత్రమే ఆడియో కాల్స్ చేసుకునేందుకు వాట్సాప్ అనుమతిస్తుంది.