
టెక్నాలజీ పెరిగినా కొద్దీ టెన్సన్స్ కూడా పెరిగేలా వున్నాయి. మొబైల్ ఫోన్ లను చాల జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి, లేదంటే మనం చిక్కుల్లో పడ్డట్టే. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పెగాసస్‌కు మించి సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌కు ముందుగా లింక్ పంపి ఓటీపీ అడుగుతున్నారు కేటుగాళ్లు. ఓటీపి చెప్పిన వెంటనే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వాట్సాప్ వెళ్లిపోతుంది. వాట్సాప్ నెంబర్‌తో డయల్ వెరిఫికేషన్ చేసుకుని..
వాట్సాప్‌లోని డేటా బ్యాకప్ తీసుకుంటున్నారు. అనంతరం వాట్సాప్ నెంబర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇటీవల ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. హ్యాక్ నెంబర్ నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ బ్యాకప్‌లో కాంటాక్ట్ వున్న వాళ్లందరికీ డబ్బు కావాలంటూ మెస్సేజ్ పెడుతున్నారు.