
వాట్సాప్ తమ యూజర్లకు కీలక సూచనలు చేసింది. వాట్సాప్ ద్వారా సైబర్ నేరాలు ఇటీవల పెరిగిపోయిన నేపథ్యంలో.. మోడ్ యాప్స్ వాడొద్దని సూచించింది. సైబర్ నేరగాళ్ల బారినుంచి తప్పించుకునేందుకు వాట్సాప్ తన యూజర్లకు పలు సూచనలు చేసింది.
మోడ్ యాప్స్ లేదా మోడిఫైడ్ యాప్స్ లో సాధారణ యాప్స్ లో ఉండే ఫీచర్స్ కంటే కొన్ని రకాల ఫీచర్స్ అదనంగా ఉంటాయి. అయితే ఇవి ఆమోదయోగ్యమైనవి కాదని వాట్సాప్ చెబుతోంది. మోడ్ యాప్స్ ఎక్కువ ఫీచర్లను అందిస్తున్నప్పటికీ, వీటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా హ్యాకర్స్ యూజర్ల ఫోన్లలోని సమాచారాన్ని సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది. వాట్సాప్ లో ఉన్న విధంగా మోడ్ యాప్స్ లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవని పేర్కొంది. అందుకే వాట్సాప్ మోడ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది. వాట్సాప్ మోడ్ యాప్స్ లో ఎఫ్ ఎండబ్ల్యూ వాట్సాప్ 16.80.0లో టార్జాన్ ట్రియాడా వైరస్ ఉన్నట్లు గుర్తించామని వాట్సాప్ తెలిపింది. ఈ వెర్షన్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే ఇందులోని వైరస్ ఫోన్ లోని మొత్తం సమాచారాన్ని హ్యాకర్స్‌కి చేరవేస్తోందని కాస్పర్ స్కై అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
ఎంతో ప్రజాదరణ ఉన్నా వాట్సాప్ కు బదులుగా అనేక మోడ్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మాడిఫైడ్, క్లోనింగ్ యాప్ లను వాట్సాప్ సంస్థలు అధికారికంగా అభివృద్ధి చేయవనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రమాదకరమైన మోడ్ లలో ఫమ వాట్సాప్ కూడా ఉంది. ఈ మోడ్ ల ద్వారా డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని వాట్సాప్ హెచ్చరించింది.