
ఆడబిడ్డ బరువు కాదు మన బాధ్యత….
ఆడబిడ్డ బరువు కాదు మన ఇంటి పరువు
ఆడబిడ్డ కష్టం కాదు మన ఇంటికి కానుక
ఆడబిడ్డ మనకు ప్రమాదం కాదు మన ఇంటిలో వెలిగే ప్రమిద
ఆడబిడ్డ అందమే కాదు అక్షర సరస్వతి కూడా
ఆడబిడ్డ భయపడే బాలిక కాదు భయపెట్టే కాళిక
ఆడబిడ్డ శోకం కాదు ఏ కవి రాయని శ్లోకం
ఆడబిడ్డ మానని గాయం కాదు మన గాయాలను మాన్పించే అందమైన గేయం
ఆడబిడ్డ కేవలం నుదుటి మీద బొట్టే కాదు విజయ తిలకం కూడా
ఆమె మన సంఘ ప్రతిష్ట
ఆమె మన ఇంటి పునాది
ఆమె మన గెలుపు పురస్కారం
ఆమె మన జీవిత మలుపు
ఆమె మన జీవితంలో అతి పెద్ద గెలుపు
ఆమె మనం చేరాల్సిన విజయ తీరం
ఆమె మన లాంటి పువ్వులను మోస్తున్న దారం
ఆమె మన మెడలో కావాలి బంగారు హారం
అమె మన నుండి ఎన్నడూ కావొద్దు దూరం
ఆమె కన్నీరు కారిస్తే మన కళ్లు చెరువు
ఆమె కాలికి ముల్లంటితే మన గుండెలు బరువు
ఆమె మలినం లేని పసినవ్వులను తెచ్చుకుందాము అరువు
ఆమె సాధించే విజయాలను జగమెల్లా చాటుతూ వేద్దాం దరువు
రచన : సాయి త్రివిక్రమ్