
తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర తెలంగాణ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తెలంగాణ నుండి దూరంగా వెళ్లిపోయిందని తెలిపింది. గల్ఫ్ లో సోమవారం వరకు ఉన్న తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి కూడా బలహీన పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.