
Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తత ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు ర్యాలీ తలపెట్టగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా తరలి వచ్చిన కార్మికులు నడుచుకుంటూ, కూర్మన్నపాలెం నుంచి విశాఖ నగరానికి పయనమయ్యారు.
విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడే వారిని అరెస్ట్ చేస్తున్నారు.