
పాగల్ సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ టైటిల్ తో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లుక్ ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసింది. ఇందులో విశ్వక్.. పెళ్లి కోసం తాపత్రయపడే వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ క్లాస్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రం యూనిట్ విడుదల చేసిన వీడియోలో..విశ్వ తనకు వయస్సు పెరిగిపోతోందని, వధువు కూడా దొరకడం లేదని చెప్పాడు.. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని.. నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. బ్యాచిలర్ లైఫ్ నుంచి నన్ను విముక్తి చెందేలా చెయ్యండి అంటూ ప్రేక్షకులను కోరుతున్నాడు విశ్వక్ సేన్.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి రవికిరణ్ స్క్రిప్ట్ ను అందించడం జరిగింది. ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ లో ఈ సినిమాను బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు.