
ఈ ఏడాది పాగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గట్లేదు. అంతేకాదు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీటితో పాటు ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు గామి అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది.