
కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా నటించబోతున్న తాజా సినిమా ‘సామాన్యుడు’. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్‌ని నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. సామాన్యుడు అనే టైటిల్‌తో తెలుగులో ఈ మూవీ విడుదల కానుందని తెలియజేశారు. పా శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓ షార్ట్ ఫిల్మ్ తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శరవణన్… విశాల్ 31వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిని చూస్తే విశాల్ కెరీర్ లో మరో మంచి మాస్ యాక్షన్ డ్రామా గా నిలుస్తుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించనుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.