
Virat Kohli: ఈ ఏడాది అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక చేశారు. కోహ్లీకి ఇది 10వ ఐసీసీ అవార్డు. దీంతో అత్యధిక ఐసీసీ అవార్డులు గెలిచిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ(246*) లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు.