
సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలీదు, ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా తెలియదు.. ఒక్కసారి ఏదైనా ట్రెండింగ్ లో వచ్చిందంటే.. కొంత కాలంపాటు దాని హవా ఇంటర్ నెట్ లో కొనసాగుతూనే ఉంటుంది. ఇలా వైరల్ అయ్యే వాటిల్లో చాలా వరకు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఇలా కూడా జరుగుతుందా అనేంతలా ఆశ్యర్యానికి గురిచేస్తుంటాయి. మరి కొన్ని వీడియోలు భయంతో వణికేలా చేస్తుంటాయి.
शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc
— Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021
తాజాగా నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే… ప్రమాదానికి గురైన లారీ రెండు ముక్కలు అయినప్పటికీ…. లారీ చాసిస్ ఆగకుండా ముందుకు వెళ్ళటం. లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మలుపు దగ్గరికి రాగానే సడెన్ గా కిందపడిపోయింది. లారీ పైభాగం విడిపోయి కిందపడగా చాసిస్ మాత్రం అలాగే పరుగులు తీసింది. లారీ పైభాగంతో పాటు కిందపడిన డ్రైవర్ వెంటనే లేచి చాసిస్ కోసం పరుగులు తీశాడు. ఇలాంటి ప్రమాదం బహుశా మరెక్కడా జరిగి ఉండదు. లారీ ప్రమాదానికి ముందు ఓ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుంచి దూసుకొచ్చిన ఆ లారీని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా ఉన్నా లారీకి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ వింత ప్రమాదం ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదు.