
విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాతువక్కుల రెండు కాదల్’. సేతుపతిని ‘రాంబో’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాలో విలన్ భవానీ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టాడు విజయ్ సేతుపతి. ఇలా ఒక మూసకే పరిమితం కాకుండా సేతుపతి విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు.
చిరంజీవి హీరోగా నటించిన తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. తర్వాత తెలుగులో మెగా మేనల్లుడు మొదటి సినిమా ‘ఉప్పెన’లో హీరోయిన్ తండ్రి పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మరో వైపు.. కొన్ని రోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్ట్లో ఓ వ్యక్తి విజయ్ సేతుపతిపై జరిగిన దాడి విదాస్పదమైంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత సదరు వ్యక్తి మహా గాంధీ… విజయ్ సేతుపతికి సారీ చెప్పాడనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది.