
వరుణ్ తేజ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘గని’. ఈ చిత్రం కోసం వరుణ్ కఠిన కసరత్తులతో కండలు తిరిగి దేహం సాధించాడు. సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. నేడు ఉ.11:08 నిమిషాలకు గని టీజర్ విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
గని టీజర్ దుమ్ము రేపనుందని తెలుస్తుండగా… ఈ టీజర్ లో హీరో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో సాగడం మరో ఆసక్తికర విషయం. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు. తమ్ముడికి అన్న మాట సాయం చేస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తున్న పోస్టర్లు ‘గని’పై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
‘RAM’page ?? pic.twitter.com/tmi1jLbM0a
— Varun Tej Konidela ? (@IAmVarunTej) November 14, 2021