
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలోని ‘గని ఆంథమ్’ పాటను శనివారం విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ ఈ చిత్రం.
అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ ‘గని’ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. వరుస హిట్స్‌తో జోష్ మీదున్న ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో మరో మైలురాయిగా చిత్రంగా ‘గని’ నిలిచిపోతుందని ఈ సినిమా మేకర్స్ చెబుతున్నారు. చిత్ర నిర్మాతలు చెబుతున్నట్లుగా ‘గని’ చిత్రం అంచనాలకు తగ్గట్లు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
వరుణ్ తేజ్ ఈ సినిమా తో పాటు ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకొంటోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.