
Uppal Stadium: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి నెలకొంది. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 2 ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లు మార్చి 1వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ చేస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ చేస్తుంది. హెచ్సీఏ ప్రతినిధులు ప్రాక్టీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు.