
శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది. మళ్ళీ వీరి కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్, కుటుంబ కథా చిత్రం ‘టక్ జగదీష్’. రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. వినాయకచవితి పండగ సందర్బంగా సెప్టెంబరు 10 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సినిమాలో నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. నేపధ్య సంగీతాన్ని గోపి సుందర్ అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్‌లోనే సందడి చేయాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్ లాక్డౌన్ ముగిశాక థియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓటీటీకే మొగ్గుచూపారు నిర్మాతలు.