
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. రేపు ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 12 వేల టికెట్లు చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
కేవలం నవంబర్ నెలకు మాత్రమే సంబంధించిన సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు ఈ నెల 23న విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతారు. శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్ ను అధికారులు మూసివేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు… కీలక ఆదేశాలు జారీ చేసింది టీటీడీ పాలకమండలి. భక్తులు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ లేదా రెండు డోసులు టీకా వేసుకున్నట్లు ఉన్న సర్టిఫికెట్ ను తీసుకొని వస్తేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది.