
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి అభిమానులతో ‘స్టైలిష్ స్టార్’ అనిపించుకొని.. నటన, డ్యాన్స్‌తో యూత్‌ను మెస్మరైజ్ చేసి, ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ అయిపోయాడు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే ఏ ఇతర హీరకు సాధ్యం కానీ రీతిలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు బన్నీ. తాజాగా ఈ హీరో తన ఇన్‌స్టాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు. అంటే నెట్టింట్లో బన్నీకి దాదాపు కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ రికార్డును అందుకున్న తొలి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఆయన తర్వాత 12.9 మిలియన్ ఫాలోవర్స్‌తో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నాడు.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తొలి భాగం క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది.