
తిరుపతి, తిరుమల భారీ వర్షాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తిరుమల మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. శ్రీ వారి నడక మార్గాల్లో చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. ఈ వర్షాలకు శ్రీవారి మెట్ల మార్గం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది.