
తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా బీస్ట్ . ఈ సినిమాని నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తుంది. మాస్టర్’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నా.. లీకింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం తమిళనాడులోని బ్రిస్క్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అన్అఫిషియల్గా మూవీ కంటెంట్ రిలీజ్ కావడం ఇది రెండో సారి కాగా.. వైట్ కలర్ షర్ట్‌పై రక్తపు మరకలతో రోరింగ్ అవతార్‌లో కనిపిస్తున్న విజయ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.