
‘తలా’ అజిత్ సౌత్ ఇండియన్ స్టార్ కి బైక్ రేసులు అంటే మహా ఇష్టం. ఆయన ఎఫ్ 1 రేస్ లో కూడా పాల్గొన్నారు. ఆయనకు బైక్ పై లాంగ్ డ్రైవ్ లు వెళ్లడం సరదా… షూటింగ్ టైం లో కాస్త సమయం దొరికితే బైక్ పై రైడ్ లకు వెళ్తుంటాడు.

కాగా, తాజాగా తన క్రూయిజర్ బైక్ పై ఉత్తరభారతదేశ యాత్రకు వెళ్లారు. అజిత్ వాఘా వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వరకు బైక్ పై వెళ్లడం విశేషం. బోర్డర్ గేట్ వద్ద త్రివర్ణ పతాకం చేతబూని ఫొటోలకు పోజులిచ్చారు.


ఈ సందర్భంగా భారత దేశ సైనికులు అజిత్ తో సెల్ఫీ లు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. అజిత్ అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. అజిత్ బైక్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ చిత్రం షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు.