
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో గా, వసంత నాగేశ్వరరావు దర్శకత్వం లో ‘బజార్ రౌడీ’ సినిమా రూపొందింది.ఈ సినిమాను సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమాతో మహేశ్వరి అనే కొత్త అమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఇంత కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేసారు. సంపూ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన యాక్షన్ విజువల్స్ బాగున్నాయి. “రౌడీలకు రామాయణం చెబితే రావణాసురుడిని ఫాలో అవుతారుగానీ, రాముడిని కాదు”.. “వచ్చిన వాడు కాళీ … నాకు ఎదురొచ్చినవాడు ఖాళీ” అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సినిమాను గురించి సంపూ మాట్లాడుతూ .. “నేను చేసిన 5వ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ మరింత ఇష్టపడేలా ప్రయత్నం చేశాను. చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఈ సినిమాతో వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.