
జోర్ సే అంటూ సాగిపోతున్న ఈ లిరికల్ సాంగ్‌కి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, సాకీ శ్రీనివాస్, బరిమిశెట్టి ఆలపించారు. మణిశర్మ బాణీలు కట్టారు. ఫుల్ జోష్‌లో కనిపించిన మెగా మేనల్లుడు.. ఈ సాంగ్ తనకెంతో స్పెషల్ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత ఈ పాటలో హార్ట్‌ఫుల్ డాన్స్ చేశానని, ఇది మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భారీ రేంజ్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.