
ఫీల్‌గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో చైతన్య-సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. తెలంగాణ స్టైల్లోని వారి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బిజినెస్‌లు చేయలేం.. మనతోని కాదని.. మాటలు అంటున్నరే…’ అంటూ సాగే సంభాషణలు సినిమాలో నాగచైతన్య పాత్ర తెలియజేసేలా ఉన్నాయి. ‘బతుకు కోసం ఈ ఊరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం.. కానీ, తెల్చుకుని చద్దాం’ అంటూ ట్రైలర్ చివర్లో నాగచైతన్య చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురి చేస్తోంది.
ఈ ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు. లైఫ్‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడే కష్టాలు.. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో చూపించారని తెలుస్తోంది. డాన్స్ మాస్టర్‌గా సక్సెస్ కోసం చైతూ పడే తపన ఈ సినిమాలో హైలైట్ పాయింట్ కానుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘లవ్ స్టోరీ’ ఈ నెల 24న విడుదలకానుంది.