
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. దీంతో పాటు.. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ అనే సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. రామాయణ మహాగాథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. దీంతో పాటు ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది.
The camera is set! #ProjectK is coming to your state. If you are an actor, model, dancer, martial artist, or anyone who likes to perform, come, be the Face of the Future.
Mail us your profile to audition.
#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/T1RX7b3Etl— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 6, 2021
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ సినిమా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె నటించనుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.