
హీరో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ప్రభాస్ సినిమా కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తున్నారంటే అతను ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో చెప్పనవసరంలేదు. ఈ మధ్య ప్రభాస్ స్పీడ్ ను పెంచాడు. ఒక సినిమా తరువాత ఒకటి సినిమాను చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్, ఒక్కసారిగా తన పద్ధతిని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకుని, అనుకున్న ప్రకారం వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాడు.
ప్రభాస్ఈ మధ్యనే ‘రాధే శ్యామ్’ షూటింగును పూర్తి చేసారు, ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశాడు. ఇక హిందీ డైరెక్టర్ ‘ఆది పురుష్’ షూటింగు కోసం రీసెంట్ గా ముంబై వెళ్లి, ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రామాయణం కథను బేస్ చేసుకొని తీస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ .. కృతి సనన్ కాంబినేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరిస్తున్నారట. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది దసరా బరిలో ఈ సినిమా ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.