
స్టార్ హీరోయిన్, అక్కినేని సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ‘శాకుంతల’గా ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్.. విజయవంతంగా షూటింగ్ పూర్తి చేశామని పేర్కొంటూ అఫీషియల్ వీడియో రిలీజ్ చేసింది. దర్శకుడు గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా.. యూనిట్ మొత్తానికి చిరు కానుకలు ఇచ్చారు. చిత్ర బృందానికి వీడ్కోలు పలుకుతూ దర్శక నిర్మాతలు కాస్త ఎమోషనల్గా ఫీల్ కావడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అర్హ ఈ సినిమాలో చిన్నారి భరతుడి పాత్రలో కనిపించనుందట. దీనికి సంబంధించి ఆ మధ్య ఓ పోస్టర్ను కూడా విడుదల చేసారు. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు. చిత్రంలో చూపించే యుద్ధ సన్నివేశాలు, సమంత లుక్ హైలైట్ కానున్నాయని టాక్. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు గుణశేఖర్. విడుదల తేదీపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.
“It’s a #WrapForShaakuntalam shoot!” ? ? ⚔️https://t.co/8cOPS8wQU1#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/ohwwQqMLRs
— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2021