
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అందాల రీతూ కనిపించడంతో టీజర్ ప్రారంభమైంది. ‘‘అమ్మా.. వీళ్లెవరూ నాకు కనెక్టవడం లేదే ”, ‘‘అన్నిటికీ ఇదే అంటావు! ఇప్పుడు నీ వయసు ముప్పై..’’ అంటూ పాత్రధారులు చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ‘‘దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ..” అనే మాటలు వినపడుతుండగా, కారు నడుపుతూ వస్తున్న హీరో నాగశౌర్య గ్లామరస్ గా ఉన్నాడు. ‘ఆ అందం, ఆ పొగరు ఆర్డరు ఇచ్చి చేయించినట్టుంటుంది’ అంటూ నాగశౌర్య చెప్పిన డైలాగ్, కథానాయకుడు, కథానాయికల మధ్య మాటల సన్నివేశాలతో ‘వరుడు కావలెను’ టీజర్ కలర్ ఫుల్ గా ఉంది.
మా వధువు కు 'వరుడు కావలెను'
Here's our fun-filled #VaruduKaavalenuTeaser❤️
Hope you all like it! ?
▶️ https://t.co/8sHsxBB69j@IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @vamsi_p1988 @NavinNooli @adityamusic @sitharaents
— Sithara Entertainments (@SitharaEnts) August 31, 2021
సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం లక్ష్మీ సౌజన్య. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.