
యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘లక్ష్య’. కరోనా కారణంగా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు మేకర్స్.
Anddd ! Its A WRAP ?#Lakshya ? Shooting Target Achieved ✅
The journey is memorable.❤️Targeting to hit your Hearts in Theatres Soon ?#KetikaSharma@AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @IamJagguBhai @kaalabhairava7 pic.twitter.com/9erW9lUK0Q
— Naga Shaurya (@IamNagashaurya) August 30, 2021
‘‘త్వరలో థియేటర్లలోకి వచ్చి మీ హృదయాలను గెలుచుకోవాలనేదే తదుపరి లక్ష్యం…’’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక, చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. అతి త్వరలోనే మిగతా పనులన్నీ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ ‘లక్ష్య’ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజు వేచి చూడాలి.