
పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్లో దూసుకుపోతున్న హీరోయిన్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. మెగా హీరోల సరసన ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. గతంలో వరుణ్ తేజ్ జోడీగా ‘ముకుంద’, ‘గద్దలకొండ గణేశ్’ చేసిన ఆమె, ఆ తరువాత బన్నీ జోడీగా కూడా రెండు సినిమాలు చేసింది. ‘దువ్వాడ జగన్నాథం’ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. తాజాగా చరణ్ సరసన నాయికగా ‘ఆచార్య’ చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే పూజా మరోసారి బన్నీతో జోడీ కట్టనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. తాజాగా వేణు శ్రీరామ్ తో చెయ్యబోయే ‘ఐకాన్’ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడట. నిర్మాత దిల్ రాజు కూడా పూజా ఫామ్ లో ఉంది కాబట్టి ఈ హాట్ బ్యూటీకే ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆమె డేట్లు గురించి కనుక్కోమని తన టీమ్ ని ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్లుగా టాక్. నిజానికి ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ. పుష్ప సినిమా షూటింగ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బన్నీ మాత్రం వీలైనంత తొందరగా ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తూనే.. నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట.