
తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని అన్నారు. నేను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా… మీరు చెప్పింది తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని వ్యాఖ్యానించారు.
కేంద్రానికి గడిచిన ఆరున్నరేళ్ల లో పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.