
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపాన ఉన్న కోకాపేట, ఖానమెట్ భూముల వ్యవహారం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ లోని సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సంబంధిత భూములను తమ అనుకూల వ్యక్తులకు కట్టబెట్టారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గి పోయిందన్నారు. దాదాపు 1500 కోట్ల విలువ చేసే భూమిని తక్కువ రేట్ లో అమ్మి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ని కలిసిన రేవంత్ రెడ్డి ఈ భూముల అమ్మకం, కొనుగోలు పై విచారణ జరపాలని ఆయన కోరానన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు, టిఆర్ఎస్ వల్ల రాష్ట్రంలో రాజకీయాలను కలుషితం అయ్యాయని, ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగ చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కోకాపేట, ఖానామేట్ భూముల్లో అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా ఆరోపించారు.