
Close up of Indian 2000 rupee notes
తెలంగాణ రాష్ట్రంలో రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. రెండో రోజు మంగళవారం 38,050 మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల రుణమాఫీకి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. హామీ ప్రకారం ఈ ఏడాది రూ.50 వేల వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు.