
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈసారికి హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఆదేశాలను సవరించాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కొట్టేసింది. దీనిపై తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని ఆదేశించింది. ఇదే అంశంపై గతేడాది కూడా తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము గతంలో ఇచ్చిన అనేక ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ప్రస్తుతం ఈ అంశంలో ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై మరోసారి అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది.