
సీఎం కేసిఆర్ నిజ జీవితంలో జై భీం అనే స్లోగన్స్ ఇచ్చాడా.. ఏడు సంవత్సరాల కాలంలో ఎప్పుడైన అంబేద్కర్ విగ్రహాం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించాడా అని ఈటల ప్రశ్నించాడు.. కాని నేడు ఆయన ఫోటోను పక్కన పెట్టుకుంటున్నాడని అన్నారు. ఇదంతా కేవలం దళిత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే నేడు సీఎం నాటకం ఆడుతున్నారని అన్నారు. గతంలో సీఎస్‌గా పనిచేసిన ప్రవీణ్ చంద్ర లాంటీ వారి పదవి విరమణకు కూడా వెళ్లలేని దుస్థితి కేసిఆర్‌ది అని విమర్శించారు. సీఎం కేసిఆర్ ఓటమి భయంతోనే నాతో పాటు ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కూడా పోలీసు నిఘా పెట్టే దుస్థితికి వచ్చారని విమర్శించారు. మరో వైపు సీఎం కేసిఆర్ మండల స్థాయికి దిగజారడాని విమర్శించారు. మండలం కాదు కదా, ప్రతి గ్రామంలో తిరిగినా ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని సవాల్ విసిరారు.
సీఎం పేషిలో ఎస్సీ అధికారులనే కాకుండా బీసీ, ఎస్టీ,మైనారిటీ అధికారులను కూడా నియమించాలని ఆయన డిమాండ్ చేశాడు.తాను డిమాండ్ చేయడం ద్వార ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారని నియమించారని అన్నారు. వాసాల మర్రిలో ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పటి వరకు లబ్ధిదారులకు చేరలేదని అన్నారు. హుజూరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఇచ్చే డబ్బులపై అన్ని అధికారాలను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎనిమిది సంవత్సరాలుగా సీఎం కేసిఆర్ చేసిన అన్యాయాలు ఒక్క క్షణంలో మారి పోవని దుయ్యబట్టారు. చైతన్యవంతమైన తెలంగాణలో ప్రజలు ఇలాంటీ జిమ్మిక్కులను నమ్మలేరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాలిటిక్స్‌లో ఎప్పుడు కూడా జడపదార్థం లాగా ఉండవని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే పార్టీ కావడంతో బీజేపీలో చేరారని మరోసారి స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో కిరాయి మనుష్యుల చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారి చేత పోస్టర్లు వేయించడం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం కేసిఆర్ ఇలాంటీ చిల్లర వేశాలు వేస్తాడని తనకు తెలుసని అన్నారు. ఈటల రాజేందర్ ఎనాడు ఇతరులపై కేసులు పెట్టలేదని స్పష్టం చేశాడు.