
చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు తెలంగాణ లోని వివిధ జిల్లాలలోని అన్ని ప్రభుత్వ జూనియర్ ,డిగ్రీ కళాశాలలో గురువారం రోజు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చరిత్ర పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు జూనియర్ మరియు డిగ్రీ, వృత్తి విద్యా, టెక్నికల్ మరియు ప్రొపెషనల్ కళాశాలలలోనీ కోర్సుల యందు చరిత్ర సబ్జెక్టు ను తప్పనిసరి బోధనాంశం గా ప్రవేశపెట్టి బావి తరాల విద్యార్థులు తెలంగాణ కవుల యొక్క జీవిత చరిత్రలను ,తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రను భోదించి, చదివేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా జూనియర్ ,డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, చరిత్ర అధ్యాపకులతో పాటు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు..