
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు, మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని, వానల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు, రోడ్లు, నాలాలు తదితర విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2021