
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించింది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని అన్నారు.