
తెలంగాణలోని మద్యం దుకాణాలకు డ్రా నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో దుకాణాలకు భారీగా టెండర్లు జరిగాయి. 2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు ఒక్కరోజే 36 వేల 762 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో లైసెన్స్‌కు 25 మంది పోటీదారులు ఉన్నారు. టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.13,299 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.