
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఆదేశాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఆపేందుకు టీకా తీసుకోవడం ముఖ్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా చాలా మంది తీసుకోవడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.