
కాంగ్రెస్ మహిళా నాయకురాలు కల్పన అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా, ఐడిఎమార్సీలో కీలకంగా పని చేసిన క్రమశిక్షణ గల నాయకురాలు కల్పన అని కొనియాడారు. ఆమె చిన్న వయసులో లివర్ కాన్సర్తో మృత్యువాత పడడం అత్యంత బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
నా సోదరి సమానులైన కల్పన గారు మరణించడం నన్ను ఎంతగానో కలచివేసింది, తెలంగాణ పిసిసి సెక్రెటరీ గా ఉంటూ ఎల్ డి ఎం ఆర్ సి ద్వారా మహబూబాద్ పార్లమెంట్ నియోజవర్గం లోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు…
సోదరి కల్పన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
