
కొందరు జైలులో తనను చంపేందుకు కుట్ర పన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. అక్టోబరు 2న పాత నేరస్తుల సహకారంతో ప్రణాళికను అమలు చేసేందుకు ప్రయత్నించారని తీన్మార్ మల్లన్న అన్నారు. మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెములలో ఆదివారం ‘తీన్మార్ మల్లన్న టీమ్ భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. అక్టోబరు 2న తనపై హత్యాయత్నం విఫలమై మరుసటి రోజే జైలులోని చీకటి గదిలో బంధించారని తెలిపాడు. ఆ సమయంలోనే మానసిక దివ్యాంగులకిచ్చే ఔషధాలను బలవంతంగా ఎక్కించి తనను ‘పిచ్చివాడి’ని చేయాలనుకున్నారని చెప్పారు.