
జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురయ్యింది. మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ను కోర్టు కొట్టేసింది. మల్లన్నను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ధర్మాసనం అనుమతించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు మల్లన్నను చిలకలగూడ పోలీసులు విచారించనున్నారు. కాగా, తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని ఓ జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మల్లన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.