యాపిల్ ఐ ఫోన్లు వాడే వారిలో ఈ-కామర్స్ ఆప్ అమెజాన్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. ఈ ఇష్యూ ఆండ్రాయిడ్ ఫోన్ లకి సంబంధించి యాప్లో ఎటువంటి సమస్యా రాలేదు. ఒక ఐఓఎస్ ఐ ఫోన్ యాప్ వాడే వారు మాత్రం టెక్నికల్ సమస్య ఎదుర్కొన్నారు. కొందరు తాము ఇచ్చిన ఆర్డర్ల హిస్టరీ చెక్ చేసుకో లేకపోతే, మరి కొందరు కొత్తగా ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. కొందరికి లొకేషన్ పిన్ మారక పోవడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి. ‘‘Sorry something went wrong. We’re working on fixing it. (CS11)’’(ఏదో సమస్య వచ్చినందుకు సారీ. దీన్ని సరిచేయడానికి పని చేస్తున్నాం) అని మెసేజ్ వచ్చింది.
దీనిపై పలువురు వినియోగదారులు అమెజాన్ను సంప్రదించారు. ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ‘‘ఉదయం నుంచి ఇదే సమస్య ఉంది. యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేశాను. అయినా ప్రాబ్లం పోలేదు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు.. ఈ సమస్య వచ్చినందుకు వినియోగదారులకు సారీ చెప్పారు. ఇది తెలిసిన సమస్యేనని, తమ బృందం దీనిపై పనిచేస్తోందని వివరించారు. అయితే ఇలా ట్విటర్లో సమాధానం చెప్పడమేకానీ, ఈ సాంకేతిక సమస్యపై అమెజాన్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.